హైదరాబాద్ : అంబర్ పేట్ లోని శాంతినగర్ లో విషాదం నెలకొంది. పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో…పెళ్లికి వచ్చిన వ్యక్తులపై ప్రహారి గోడ ఒక్కసారిగా పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. గాయపడిన వారిని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీం… సహాయక చర్యలు కొనసాగించాయి.
చనిపోయిన వారిలో ఒకరు అంబర్ పేటకు చెదిన లక్ష్మీ, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కృష్ణ, సురేశ్, సోహైల్ గా గుర్తించారు. పెళ్లి ముగిసిన తర్వాత హాల్లో నిల్చున్న టైంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఫంక్షన్ హాల్ యాజమాన్యం… సరైన బేస్ లేకుండా నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. అయితే గోడ కూలటంతో పక్కనే ఉన్న రెండు ఆటోలు, ఐదు బైక్ లు పూర్తి ధ్యంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు మృతుల కుటుంబాలకు GHMC 2 లక్షల పరిహారం ప్రకటించింది. గోడకూలిన ఘటనపై మేయర్ బొంతు రామ్మోహన్ దిగ్ర్భంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి.