హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో వాల్పోస్టర్లు, వాల్రైటింగ్స్ ను నిషేధించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. అనుమతులు లేకుండా వాల్ పోస్టర్లు వేసినా, వాల్ రైటింగ్స్రాసినా సీరియస్యాక్షన్ఉంటుందని హెచ్చరించారు. డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలోని ప్రింటింగ్ ప్రెస్, సినిమా థియేటర్ యజమానులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.
గోడలపై సినిమా, ఇతర పోస్టర్లు అంటించకుండా, రాతలు రాయకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వినకపోతే ఫైన్లు వేయాలని, ఆ వివరాలను తనకు పంపించాలని ఉత్తర్వులు జారీ చేశారు.