నష్టాలు భరించలేం.. కేసీఆర్ కు బార్ అండ్ రెస్టారెంట్స్ అసోషియేషన్ లేఖ

నష్టాలు భరించలేం.. కేసీఆర్ కు బార్ అండ్ రెస్టారెంట్స్ అసోషియేషన్ లేఖ

ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు GHMC  బార్ అండ్ రెస్టారెంట్స్ అసోషియేషన్ సభ్యులు . ఏప్రిల్ 21 నుంచి మే 11 వరకు విధించిన కర్ఫ్యూ, ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా బార్లకు తీవ్ర నష్టం కలుగుతుందని లేఖలో వివరించారు. లైసెన్స్ ఫీజు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. పొద్దున 6 నుంచి  పది గంటల టైంలో బార్లు నడుస్తలేవన్నారు. రోజూ 2 నుంచి 5 వేల బిజినెస్ మాత్రమే జరుగుతుందన్నారు. ఏడాదికి 40 లక్షల లైసెన్స్ ఫీజు ప్రభుత్వం ముందే కట్టించుకుందని, ఈ నష్టాలు భరించలేమని ఆవేదన వ్యక్తం చేశారు. లైసెన్స్ ఫీజు పిరియడ్ ను పొడిగించాలని సీఎంను కోరారు సభ్యులు.