జీహెచ్ఎంసీ బడ్జెట్కు స్టాండింగ్ కమిటీ ఆమోదం

జీహెచ్ఎంసీ బడ్జెట్కు స్టాండింగ్ కమిటీ ఆమోదం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2022 – 23 వార్షిక బడ్జెట్కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూ.6,150కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా స్టాండింగ్ కమిటీ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.5,600 కోట్లుగా ఉన్న 2021 – 22 బడ్జెట్ను రూ.6,300 కోట్లుగా సవరించారు.

గతేడాది హౌసింగ్ కాంపొనెంట్కు రూ. 1,241.87 కోట్లు కేటాయించ‌గా.. ఈసారి రూ. 406.70 కోట్లకు పరిమితం చేశారు. ప్రాపర్టీ ట్యాక్స్ రూ.1700 కోట్లు, టౌన్ ప్లానింగ్ రూ.1200 కోట్లు, ట్రేడ్ లైసెన్స్ రూ. 63కోట్లు, 15వ పట్టణ ప్రగతికి రూ.708 కోట్లు కేటాయించారు. టీడీఆర్ ద్వారా 500 కోట్లు వస్తాయని అంచనా వేశారు.
 

For more news..

రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం అంత ఈజీ కాదు

మంత్రి హత్యకు కుట్ర కేసు నిందితుల రిమాండ్ పొడగింపు