స్టాండింగ్ కమిటీ ముందుకు జీహెచ్ఎంసీ బడ్జెట్.. రూ.8,300 కోట్లతో ఫైనల్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ 2025–26 బడ్జెట్ ను రూ.8300 కోట్లతో ఫైనల్ అయింది. ఈసారి బడ్జెట్​లోనూ  హౌసింగ్ కార్పొరేషన్​కు ప్రత్యేకంగా రూ.300 కోట్లు కేటాయించారు. శనివారం స్టాండింగ్ కమిటీ ముందుకు బడ్జెట్ ప్రతిపాదనలు రానున్నాయి.  

అదేరోజు స్టాండింగ్ కమిటీ ఆమోదించనుంది. 2024–-25లో రూ.7,937 కోట్ల అంచనాలతో బడ్జెట్‌‌‌‌ను రూపొందించగా, సవరించిన దాంతో కలిపితే రూ.8,150 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే ఈసారి అదనంగా రూ.150 కోట్లతో బడ్జెట్ ని రూపొందించారు.