డెక్కన్ మాల్ కూల్చివేత.. టెండర్ మార్పు

 డెక్కన్ మాల్ కూల్చివేత.. టెండర్ మార్పు

సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత టెండర్ దక్కించుకున్న ఏజెన్సీని జీహెచ్ఎంసీ మార్చింది. రూ. 25.94 లక్షల రూపాయలకు కోట్​ చేసి టెండర్ సొంతం చేసుకున్న ఎస్‌కే మల్లు ఏజెన్సీ దగ్గర సరైన యంత్రాలు లేకపోవడంతో టెండర్ రద్దు చేసింది. తాజాగా ఆ పనిని మాలిక్ ట్రేడింగ్ కంపెనీకి అప్పగించింది. మాలిక్ ట్రేడింగ్ కంపెనీ హై రీచ్ భూమ్ వెహికిల్తో డెక్కన్ మాల్ను కూల్చివేయనుంది. ఎస్ కే మల్లు ఏజెన్సీ డెక్కన్ మాల్ కూల్చివేతకు అన్ని సిద్దం చేసుకున్నాక భారీ క్రేన్లో ఆయిల్ లీకేజీ కావడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. వేరే మిషన్ల రాక ఆలస్యమవుతుండటంతో సాయంత్రం కూడా పనులు స్టార్ట్ కావడం కష్టమేనని ఎస్‌కే మల్లు ఏజెన్సీ అధికారులు చెప్పడంతో  జీహెచ్ఎంసీ టెండర్ మార్చినట్టు తెలుస్తోంది.