ఫుడ్ క్వాలిటీపై తనిఖీలు చేయండి : ఆమ్రపాలి

  • బల్దియా కమిషనర్ ఆమ్రపాలి 
  • అడిషనల్, జోనల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు : సిటీలో ఫుడ్ క్వాలిటీపై తనిఖీలు నిర్వహించాలని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. బుధవారం అడిషనల్, జోనల్ కమిషనర్లతో కమిషనర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. అన్ని స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వండే ఫుడ్ సెంటర్లు, హాస్టల్ మేనేజ్ మెంట్లపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

15 రోజులు స్పెషల్ డ్రైవ్ కొనసాగించాలని  కమిషనర్ ఆదేశించారు. దోమల నివారణపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి.. యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్ చేయాలని సూచించారు. శానిటేషన్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

ఆస్పత్రుల క్యాంటీన్లలో తనిఖీలు 

పంజాగుట్ట : ప్రభుత్వ,  ప్రయివేట్​ఆస్పత్రుల క్యాంటీన్లపై ఫుడ్​సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నిమ్స్​ ఆస్పత్రిలోని క్యాంటీన్​లో ఆహార నాణ్యతపై ఫుడ్​చెక్ చేశారు. 15 ఆస్పత్రుల్లో నిర్వహించగా.. ఇందులో  11 ప్రభుత్వ, 4  ప్రయివేట్ ఆస్పత్రులు ఉన్నాయి. ఈ సందర్భంగా క్యాంటీన్ల నిర్వాహకులకు అధికారులు నోటీసులు ఇచ్చారు.

అధికారుల ప్రత్యేక డ్రైవ్  

కమిషనర్ ఆదేశాలతో బల్దియా ఫుడ్ సేఫ్టీ అధికారులు సిటీవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లు, స్కూళ్లు, కాలేజీల్లో  ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. తనిఖీల్లో భాగంగా వంటగది, సామగ్రి, వాటర్ ట్యాంక్స్, స్టోరేజ్ ఏరియా, ఫుడ్ ఐటమ్స్, మెటీరియల్, శానిటేషన్  నిర్వహణ వంటి వాటిని ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించారు. రూల్స్ పాటించకుంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.