రోడ్డు మీద చెత్త వేస్తున్నారా? అయితే జాగ్రత్త

రోడ్లపై చెత్త వేయకుండా జీహెచ్ఎంసీ అధికారులు  కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా కొందరు రోడ్లపై చెత్తవేస్తున్నారు.  మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో బైక్ పై చెత్త కవర్ తీసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులను వెంబడించారు. రోడ్డుపై చెత్త వేసిన వెంటనే వాళ్లను అడ్డుకుని ఫైన్ వేశారు జీహెచ్ఎంసీ సిబ్బంది. బైక్ ను జీహెచ్ఎంసీ ఆఫీస్ కు తరలించారు.

రోజూ ఇంటి దగ్గరకు వచ్చే ఆటోల చెత్త వేయాలని..రోడ్డుపై చెత్త వేయొద్దని సూచించారు. రోడ్లపై చెత్త వేయకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని సూచిస్తున్నారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.