అపార్ట్​మెంట్లలో డస్ట్​ బిన్లు పెట్టించాలి... జీహెచ్ఎంసీ కమిషనర్​ ఆమ్రపాలి 

హైదరాబాద్, వెలుగు: శానిటేషన్​కార్మికులు అపార్ట్​మెంట్లలో డోర్ టూ డోర్ తిరగకుండా, అసోసియేషన్లతో మాట్లాడి ఒకచోట పెద్ద డస్ట్ బిన్ ఏర్పాటు చేయించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. మంగళవారం అడిషనల్, జోనల్ కమిషనర్లతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. అపార్ట్​మెంట్లలో ఉంటున్నవారు వివిధ కారణాలతో పూర్తిస్థాయిలో చెత్తను స్వచ్ఛ ఆటోల్లో వేయడం లేదని చెప్పారు.

తడి, పొడి చెత్తను విడివిడిగా వేయడానికి డస్ట్​బిన్లు ఏర్పాటు చేస్తే ఆటోలు తీసుకుపోవడానికి ఈజీగా ఉంటుందన్నారు. కరెంట్​ట్రాన్స్​ఫార్మర్ల సమీపంలో చెత్త పారబోయకుండా పెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్కుల వద్ద డస్ట్ బిన్లు పెట్టాలని సూచించారు. జంక్షన్లలో పూల మొక్కలు పెంచాలని, యూబీడీ అధికారులను ఆదేశించారు. రోడ్లపైకి పశువులు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు.