ఫీల్డ్​కు రాని స్వచ్ఛ ఆటోల లెక్క తీయండి : కమిషనర్ ఆమ్రపాలి

ఫీల్డ్​కు రాని స్వచ్ఛ ఆటోల లెక్క తీయండి : కమిషనర్ ఆమ్రపాలి
  •      కమర్షియల్ ​ఏరియాల్లో  రాత్రిళ్లు మాత్రమే చెత్త సేకరించాలి
  •     బల్దియా కమిషనర్​ ఆమ్రపాలి ఆదేశం

హైదరాబాద్, వెలుగు :  స్వచ్ఛ ఆటోల పనితీరుపై ఫోకస్ పెట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె అడిషనల్, జోనల్ కమిషనర్లు, ఎంటమాలజీ చీఫ్ లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. డ్యూటీకి రాకుండా, చెత్త సేకరణకు డుమ్మా కొడుతున్న ఆటో డ్రైవర్ల వివరాలు సేకరించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమర్షియల్ ఏరియాల్లో రాత్రిళ్లు మాత్రమే చెత్త సేకరించేలా చూడాలన్నారు. సినిమా థియేటర్లలోని పార్కింగ్ రేట్లను పరిశీలించాలన్నారు.

అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టాలని జోనల్ కమిషనర్లకు సూచించారు. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద సంపుల నిర్మాణానికి టెండర్ల పక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. డెంగీ బాధితుల వివరాలు సేకరించాలని, ప్రతిరోజు మధ్యాహ్నం లోపు డేటాను హెడ్డాఫీసుకు పంపాలని స్పష్టం చేశారు. చీఫ్ ఎంటమాలజిస్ట్ ఈ బాధ్యత తీసుకోవాలన్నారు.

సిటీలోని పరిస్థితిపై దానకిశోర్​ ఆరా

వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై మున్సిపల్​ప్రిన్సిపల్​సెక్రటరీ దానకిశోర్ ఆరా తీశారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అధికారులతో సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదివారం కురిసిన భారీ వర్షానికి ఎఫెక్ట్​అయిన ప్రాంతాల వివరాలు తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించాలని అధికారులకు సూచించారు.

వెంటనే అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పారు. సహాయక చర్యల కోసం ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.