మహిళా పోరాట శక్తికి ప్రతీక ఐలమ్మ: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి

పంజాగుట్ట/చేవెళ్ల/షాద్​నగర్/హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మహిళా పోరాట శక్తికి ప్రతీక అని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. గురువారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ఐలమ్మ జయంతి నిర్వహించారు. కమిషనర్​ఆమ్రపాలి ఐలమ్మ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. 

రైతాంగ పోరాటానికి ఊపిరి పోసిన యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు. అడిషనల్ కమిషనర్లు రఘుప్రసాద్, యాదగిరిరావు, పంకజ, చంద్రకాంత్ రెడ్డి, సీసీపీ శ్రీనివాస్, ఏసీపీ సుదర్శన్, డాక్టర్ రాంబాబు, సీపీఆర్ఓ మొహమ్మద్ ముర్తుజా అలీ, ఓఎస్డీ వేణుగోపాల్, ఏఎంసీ శారద, రమణ  తదితరులు పాల్గొన్నారు. వాటర్ బోర్డు హెడ్డాఫీసులో ఐలమ్మ ఫొటోకు ఎండీ అశోక్​రెడ్డి పూల మాలవేసి నివాళులర్పించారు.

ఐలమ్మ తెలంగాణ ధీర వనిత అని కొనియాడారు. ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఈడీ మయాంక్ మిట్టల్, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్-2 స్వామి, పర్సనల్ డైరెక్టర్ సుదర్శన్, సీజీఎం ప్రభు పాల్గొన్నారు. హైదరాబాద్​కలెక్టరేట్​లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. అడిషనల్​కలెక్టర్ కదిరవన్ పలని ఐలమ్మ ఫొటోకు నివాళులర్పించారు.

 అల్మాస్​గూడలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, ఎదుళ్ల ప్రతాప్‌‌రెడ్డి, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జెల్ల రమేశ్​గౌడ్, రజక సంఘం నాయకులు ఐలమ్మ ఫొటోకు నివాళులర్పించారు. గురువారం సాయంత్రం నిమ్స్​హాస్పిటల్​లో రజక సంఘం తెలంగాణ రాష్ట్ర యూత్​అధ్యక్షుడు నల్లతీగల రాజు ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి నిర్వహించారు. 

షాద్​నగర్​ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, నిమ్స్​డైరెక్టర్ డాక్టర్ ఎన్.బీరప్ప, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. చేవెళ్లలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. రజక సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. షాద్​నగర్​మండలపరిషత్​ఆఫీస్​ఎదురుగా ఉన్న ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నివాళులర్పించారు.

రజక సంఘం తాలూకా అధ్యక్షుడు పెంటయ్య, షాద్ నగర్ టౌన్ ఆధ్యక్షుడు రాంచందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ సిద్ధాంతి లో కౌన్సిలర్ వై.కుమార్ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి నిర్వహించారు. ఎమ్మెల్యేలు ప్రకాశ్​గౌడ్, వీర్లపల్లి శంకర్, బీఆర్ఎస్ ​నేత కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు.