రెయిన్ ఎఫెక్ట్: అధికారులకు GHMC కమిషనర్ ఆమ్రపాలి కీలక ఆదేశాలు

రెయిన్ ఎఫెక్ట్: అధికారులకు GHMC కమిషనర్ ఆమ్రపాలి కీలక ఆదేశాలు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎లో భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం సర్కులర్ జారీ చేసిన ఆమ్రపాలి.. జోనల్ కమిషనర్‌లు, సూపరిటెండెంట్ ఇంజనీర్లకు కీలక సూచనలు చేశారు. వర్షాకాలంలో డ్రైనేజీ వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా చూడాలని, ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ పనులు చేపట్టాలని సూచించారు. 

ALSO READ | ఓల్డ్ సిటీ మెట్రో లైన్ పనులు వేగవంతం MGBS టూ చంద్రాయన్ గుట్ట మెట్రో లైన్

వర్షం పడిన తర్వాత ప్రతి రోజు కాలువల నుండి చెత్త చెదార్థాలు తొలగించాలన్నారు. వరద నీటిలో కొట్టుకువచ్చి రోడ్డు పక్కన పేరుకుపోయిన ఘన వ్యర్థాలను వెంటనే తొలగించాలని  మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలను ఆదేశించారు. వరద నీరు రోడ్లపై నిల్వకుండా ఏర్పాటు చేసిన 141 క్రిటికల్ వాటర్‌లాగింగ్ పాయింట్లను వర్షాలు లేని సమయంలో క్లీన్ చేయాలని సిబ్బందికి సూచించారు.