శోభాయాత్ర రూట్లలో చెత్త కన్పించొద్దు
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశం
హైదరాబాద్ సిటీ, వెలుగు:గణేశ్నిమజ్జన ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి బుధవారం సమీక్షించారు. అడిషనల్, జోనల్ కమిషనర్లు, ఇతర విభాగాల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. శోభాయాత్ర కొనసాగే రూట్లలో రోడ్లపై చెత్త నిల్వలు లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు క్లీన్చేయాలని ఆదేశించారు. డార్క్ స్పాట్లలో లైట్లు పెట్టాలని, రోడ్లపై పాట్ హోల్స్ పూడ్చాలని సూచించారు.
అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని చెప్పారు. ఫీల్డ్లెవెల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని స్పష్టం చేశారు. అలాగే ఎల్బీనగర్ జోన్ లో కమిషనర్ పర్యటించారు.
హెచ్– సిటీ ప్రాజెక్ట్సీఈ దేవానంద్, ఎస్ఈ, ఇతర ఇంజినీర్లతో కలిసి అల్కాపురి జంక్షన్, ఫ్లైఓవర్ ప్రతిపాదన, టీకేఆర్జంక్షన్ నుంచి గాయత్రి నగర్, మంద మల్లమ్మ జంక్షన్ వరకు చేపట్టనున్న ఫ్లైఓవర్ ఏరియాలను ఫ్లైఓవర్ అలైన్‌మెంట్‌కు సంబంధించి మెట్రో రైల్ అధికారులతో సమన్వయం చేసుకోవా లన్నారు. తర్వాత ఎల్బీనగర్జంక్షన్ను పరిశీలించారు.
జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఇతర అధికారులు పాల్గొన్నారు. బైరామల్‌గూడ ఆర్హెచ్ఎస్ లూప్సైడ్ను పరిశీలించారు.