- 10 లక్షల లీటర్ల కెపాసిటీతో భారీ సంపులు
- రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా జీహెచ్ఎంసీ చర్యలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ రోడ్లపై వాటర్లాగింగ్పాయింట్ల వద్ద భారీ హోల్డింగ్ స్ట్రక్చర్లు(సంపులు) నిర్మిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి బుధవారం తెలిపారు.
వానల టైంలో వాటర్ లాగింగ్ పాయింట్స్వద్ద వరద నీరు నిలిచి ట్రాఫిక్సమస్యలు తలెత్తుతున్నాయని, వాటికి పరిష్కారంగా లక్ష లీటర్ల కెపాసిటీ నుంచి 10 లక్షల లీటర్ల కెపాసిటీతో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు.
రూ.100 కోట్ల అంచనాతో 50 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 18 లోకేషన్లలో 23 నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.