హైదరాబాద్ లో పార్కింగ్ ఫీజు వసూళ్ల నియంత్రణపై బల్దియా అధికారులు ఫోకస్ పెట్టారు. జీవో 63ని కఠినంగా అమలు చేయాలని అధికారులకు కమిషనర్ అమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని సర్కిల్స్ లో తనిఖీల కోసం టీమ్స్ ను ఏర్పాటు చేశారు. అర్ధగంట వెహికిల్ పార్క్ చేస్తే ఫీజు వసూలు చేయొద్దని.. షాపింగ్, సినిమా బిల్స్ ఉంటే పార్కింగ్ ఫీజులు తీసుకోవద్దని సూచించారు. పార్కింగ్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారు ప్రతి మల్టీఫ్లెక్స్, థియేటర్లలో డిస్ ప్లే ఏర్పాటు చేయాలన్నారు అమ్రపాలి.
ALSO READ | మోతీనగర్లో కరెంట్ అధికారులపై స్థానికుల దాడి
జీహెచ్ఎంసీ సమస్యలపై ఫోకస్ పెట్టిన జోనల్, అడిషనల్ కమిషనర్లతో ఆమ్రపాలి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.శానిటేషన్ వర్కర్ల హాజరు ఇంప్రూవ్ కావాలన్నారు. రోడ్డలపై గుంతలు పూడ్చాలని చెప్పారు. చెరువులు, నాలాల దగ్గర చెత్త లేకుండా చూడాలని ఆదేశించారు. డెంగ్యూ కేసుల ట్రేస్ ఔట్ లో స్పీడప్ చేయాలన్నారు.