బాణసంచా దుకాణాలకు జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ఆదేశాలు

బాణసంచా దుకాణాలకు జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ఆదేశాలు

దీపావళి వస్తుందంటే చాలు ఇష్టారీతిన బాణసంచా దుకాణాలు వెలుస్తాయి.  రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ షాపులు పెడతారు. అయితే అలాంటి వారు ఇకపై లైసెన్స్ తీసుకోకుండా దుకాణాలు పెట్టుకోవద్దని జీహెచ్ఎంసీ ఆదేశింది.  బాణసంచా షాపు యాజమానులు  తప్పకుండా టెంపరరీ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి వెల్లడించారు.

ట్రేడ్ లైసెన్స్ లేకుండా షాప్ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వబోమన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్  ఇలంబర్తి.  రిటైల్ షాపులకు 11 వేలు, హోల్ సేల్ షాపులకు 66 వేలు గా ట్రేడ్ లైసెన్స్ ఫీజు నిర్ణయించామన్నారు.  నిబంధనల మేరకు బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.  తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ కొరకు www.ghmc.gov.in ద్వారా  దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

ALSO READ | బయట తిందామంటే భయం.. భయం : కుళ్లిన కూరగాయలు, సింథటిక్ ఫుడ్ కలర్స్

 డిమాండ్ డ్రాఫ్ట్, డెబిట్/క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రేడ్ లైసెన్స్ ఫీజు  చెల్లించవచ్చనన్నారు. బాణాసంచా షాపులను ఫుట్ పాత్ లు, జనావాసాల మధ్య ఏర్పాటు చేయరాదు.  కాలనీ, బస్తీలకు దూరంగా ఓపెన్ గ్రౌండ్ లో పెద్దహాల్ లో తగిన  ఫైర్ సేఫ్టీ తో షాపులను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు కమిషనర్ ఇలంబర్తి.