- విజిట్‌చేసి రిపోర్ట్ ఇవ్వాలని డీసీలకు ఆదేశాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్ లోని కమ్యూనిటీ హాల్స్ పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి ఫోకస్ పెట్టారు. పేద వారి కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్స్ అధ్వానంగా తయారయ్యాయని, వినయోగించేందుకు వీలు లేవని ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో స్పందించారు. వాటిపై దృష్టి పెట్టాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. బల్దియా ఆరు జోన్లలోని 30 సర్కిళ్ల పరిధిలో 534 కమ్యూనిటీ హాల్స్ ఉండగా, వీటిలో కొన్నింటిని వివిధ అవసరాలకు వినియోగిస్తున్నారు. మిగతా వాటిని ఫంక్షన్ల కోసం జనం వాడుకుంటున్నారు.
అయితే ఇవి అధ్వానంగా తయారయ్యాయని కమిషనర్‌కు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో అన్ని కమ్యూనిటీ హాల్స్‌ను విజిట్చేయాలని డీసీలను ఆదేశించారు. ఫొటోలు, వీడియోలు తీసి రిపోర్ట్ సమర్పించాలన్నారు. కమ్యూనిటీ హాల్స్ ఎవరి అధీనంలో ఉన్నాయి? దేనికోసం వాడుతున్నారు? రెంట్ కు ఇచ్చారా? ఎన్ని చోట్ల రిపేర్లు చేయాల్సిన అవసరం ఉంది అన్న వివరాలతో నివేదిక ఇవ్వాలన్నారు.