జీహెచ్ఎంసీలో 139 మంది శానిటరీ జవాన్ల బదిలీ

జీహెచ్ఎంసీలో 139 మంది శానిటరీ జవాన్ల బదిలీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలోని 139 మంది శానిటరీ జవాన్లను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 30 సర్కిళ్లకు సంబంధించిన 139 మందిని బదిలీ చేసినట్లు తెలిపారు. 

జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 269 మంది శానిటరీ జవాన్లు పనిచేస్తుండగా, 5 సంవత్సరాలు పైబడి ఒకే సర్కిల్ లో పనిచేస్తున్న 139 మందిని బదిలీ చేశారు.