
అంబర్పేట లో GHMC కమీషనర్ ఇలంబరితి పర్యటించారు. గోల్నాక నుండి అంబర్ పేట ఇరానీ హోటల్ వరకు 335 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. మధ్యలో కొంతభాగం భూసేకరణ పూర్తి కాలేదు. సర్వీస్రోడ్డు కోసం భూసేకరణ ఇంకా పూర్తికాలేదు. అసంపూర్తిగా ఉన్న పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అధికారులతో కలిసి భూసేకరణ పనులను వేగవంతం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా భూసేకరణ చేసి త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.