జీహెచ్ఎంసీలో ప్రక్షాళన మొదలైంది. రెండు రోజుల్లో 50 మందికి పైగా అధికారులను బల్దియా నుండి తొలగించారు కమిషనర్ రోనాల్డ్ రాస్. రిటైర్డ్ అయినా విధుల్లో కొనసాగిన 37 మందిని మార్చి 1న టర్మినేట్ చేశారు. అక్రమాలకు పాల్పడిన మరో 14 మందిని ఇవాళ విధుల నుంచి తొలగించారు.
ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా GHMCకి నష్టం చేసిన 14 మంది సూపర్ వైజర్లను సస్పెండ్ చేశారు. అంబర్ పేటలో 11 మంది, శేరిలింగంపల్లి నుండి ముగ్గురు సూపర్ వైజర్లపై వేటు వేశారు. వచ్చే రోజుల్లో మరికొందరిపై వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. GHMCలో అనేక ఏళ్ల నుంచి జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ రోనాల్డ్ రాస్. అక్కడి మెడికల్ ఆఫీసర్ జ్యోతి భాయ్ కు మెమో ఇచ్చారు కమిషనర్ రోనాల్డ్ రాస్.
రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా GHMC విధుల్లో కొనసాగుతున్న 37 మంది అధికారులను మార్చి 1న విధులను తొలగించారు కమిషనర్ రోనాల్డ్ రాస్. మొత్తం 46 మంది ఉద్యోగులు ఎక్స్ టెన్షన్ పై విధులు నిర్వహిస్తున్నారు.మిగతావారిని వారికి ప్రత్యామ్నాయంగా ఉద్యోగులను నియమించిన తర్వాత వారికి ఉద్వాసన పలుకుతామని రోనాల్డ్రాస్ చెప్పారు.