
హైదరాబాద్, వెలుగు: సిటీలో వరద నీటి నిల్వ సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం సోమాజిగూడ, ఖైరతాబాద్ ఏరియాల్లో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను పరిశీలించారు. మెర్క్యురీ తాజ్ కృష్ణ హోటల్ వద్ద వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద నుంచి వచ్చే వరద నేరుగా వెళ్లేందుకు మెర్క్యురీ, తాజ్ హోటల్, ఆర్ టీఏ ఆఫీసు, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద సంపులు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఆయన వెంట ఈఎన్ సీ జీయావుద్దిన్, ఖైరతాబాద్ జోనల్ ఎస్ఈ రత్నాకర్, ఈఈ ఇందిరాబాయి, సిబ్బంది ఉన్నారు.