నగదు లావాదేవీలపై ఫోకస్ పెట్టాలి.. జీహెచ్ఎంసీ కమిషనర్​ రోనాల్డ్​రోస్ 

నగదు లావాదేవీలపై ఫోకస్ పెట్టాలి.. జీహెచ్ఎంసీ కమిషనర్​ రోనాల్డ్​రోస్ 

హైదరాబాద్, వెలుగు: నగదు లావాదేవీలపై స్పెషల్​ఫోకస్​పెట్టాలని హైదరాబాద్​జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ బ్యాంకర్లకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గురువారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో సీపీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి బ్యాంక్​కో-ఆర్డినేటర్లు, నగదు రవాణా ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళి, నగదు రవాణా గైడ్​లైన్స్​వివరించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. ఈఎస్ఎంఎస్ అప్లికేషన్ పై అవగాహన కల్పించారు. అనుమానాస్పద బ్యాంక్​లావాదేవీల వివరాలను తమకు అందించాలని చెప్పారు.

ముఖ్యంగా గత మూడు నెలలకు సంబంధించి నగదు లావాదేవీల నివేదికను బ్రాంచుల వారీగా ఇవ్వాలని సూచించారు. క్యాష్ ట్రాన్స్​ఫర్ ఏజెన్సీలు నిబంధనలకు మించి నగదు తీసుకెళ్తే సీజ్​చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, ఆర్బీఐ మేనేజర్ అంకిత్ అగర్వాల్, ఎల్.డి.ఎం సుబ్రహ్మణ్యం, ఎలక్షన్ ఎక్స్ పెండేచర్ మానిటరింగ్ నోడల్ ఆఫీసర్ శరత్ చంద్ర, వివిధ బ్యాంకుల కో-ఆర్డినేటర్లు, ఏజెన్సీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.