విజేత సూపర్ మార్కెట్ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ కమీషనర్

రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్గూడలో విజేత సూపర్ మార్కెట్ను జీహెచ్ఎంసీ  కమీషనర్ రోనాల్డ్ రోస్ సీజ్ చేశారు.  రాజేంద్రనగర్లో అధికారులతో కలిసి సెప్టెంబర్ 26 మంగళవారం రోజున ఆయన పర్యటించారు ... ఈ క్రమంలో  తన ముందే చెత్తను రోడ్డుపై పడేశారు విజేత సూపర్ మార్కెట్ సిబ్బంది. దీంతో సీరియస్ అయిన   రోనాల్డ్ రోస్ .. వెంటనే  ఆ సూపర్ మార్కెట్ ను  సీజ్ చేసి రూ. 50 వేల రూపాయల జరిమానా విధించారు. 

ALSO READ : గవర్నర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ లో  విజేత సూపర్ మార్కెట్ అంటే తెలియని వారంటూ ఉండరు.  సామన్యుల నుంచి ధనికులు వరకు అందులోకి వెళ్తుంటారు. సిటీలో మంచి బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఈ సూపర్ మార్కెట్ వార్తల్లోకి ఎక్కడం ఇదేం మొదటిసారి కాదు.  గతంలో  మదీనాగూడ, చందానగర్‌ ప్రాంతాల్లో ఉన్న విజేత సూపర్‌ మార్కెట్‌లో ఓకే సమయంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. అధికారుల సోదాల్లో నిర్వహకులు స్టోర్‌లో నాసీరకం పదార్ధాలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు.