- జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ లోని మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్‌లో పార్కింగ్ ఫీజు వసూళ్లపై ఫోకస్పెట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లతోపాటు మల్టీప్లెక్స్, బడా షాపింగ్ మాల్స్‌లో మొదటి అరగంట ఎలాంటి పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దన్నారు.
ఆదేశాలను పకడ్బందీగా అమలు చేసేందుకు ఈవీడియం అధికారులతోపాటు జోనల్, సర్కిల్ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు. అలాగే సీజనల్వ్యాధులు ప్రబలకుండా చూడాలని ఆమ్రపాలి ఆదేశించారు.
శుక్రవారం జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. పాట్ హోల్స్ ను ఎప్పటికప్పుడు పూడ్చాలని చెప్పారు. చెరువులు, నాలాల వద్ద ఎలాంటి భవన నిర్మాణ వ్యర్థాలు, సాలిడ్ వేస్ట్ ఉండకూడదని స్పష్టం చేశారు.