
హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్దియాలో ఏండ్లుగా ఒకేచోట పని చేస్తున్న 11 మంది ఇంజినీర్లను బదిలీచేస్తూ కమిషనర్ ఇలంబరితి గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఎల్బీనగర్ జోన్ లో సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా ఉన్న ఎస్ఎస్ నిత్యానందమ్ ను జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులోని క్వాలిటీ కంట్రోల్ సెల్– 2కు ట్రాన్స్ఫర్చేశారు. హెడ్డాఫీసులోని హౌజింగ్ విభాగం చీఫ్ ఇంజినీర్ గా పనిచేస్తున్న భాస్కర్ రెడ్డి స్థానంలో చీఫ్ ఇంజినీర్ గా అదనపు బాధ్యతలు నిత్యానందమ్ కు అప్పగించారు. ఖైరతాబాద్ జోన్ లోని సహదేవ్ రత్నాకర్ కు హెడ్డాఫీసులోని మెయింటనెన్స్ విభాగం చీఫ్ ఇంజినీర్ గా అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను అదనంగా నిర్వహిస్తున్న ఎస్.భాస్కర్ రెడ్డిని ప్రాజెక్టులు, ఇంజినీరింగ్ అడ్మిన్ కే పరిమితం చేశారు.
క్వాలిటీ కంట్రోల్ సెల్–-2 సూపరింటెండెంట్ ఇంజినీర్ జాకీర్ హుస్సేన్‌ను సూపరింటెండెంట్ ఇంజినీర్ క్వాలిటీ కంట్రోల్ సెల్ -–1 సూపరింటెండెంట్ ఇంజినీర్ గా, క్వాలిటీ కంట్రోల్ సెల్– -1 సూపరింటెండెంట్ ఇంజినీర్అశోక్ రెడ్డిని ఎల్బీనగర్ సూపరింటెండెంట్ గా బదిలీ చేశారు. హయత్ నగర్ డివిజన్– -3లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి.ఆశాలతను డివిజన్–16 అంబర్ పేట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా, అంబర్ పేట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.రమేశ్ బాబును డివిజన్-–3 హయత్ నగర్ ఈఈగా, డీఈఈ ఆస్రా అమీనా హమీద్ ను చీఫ్ ఇంజినీర్(ప్రాజెక్టులు)కు ఓఎస్డీగా నియమించారు. ఇప్పటి వరకు హౌజింగ్ విభాగానికి సంబంధించి క్వాలిటీని పర్యవేక్షించిన చీఫ్ ఇంజనీర్ నుంచి ఆ బాధ్యతలను ఎస్ఈ క్వాలిటీ కంట్రోల్ సెల్ -–1కు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.