పాతబస్తీలో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్పై దాడి.. ఇవాళ (ఫిబ్రవరి 17) గ్రేటర్ ​వ్యాప్తంగా పనులు బంద్​

పాతబస్తీలో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్పై దాడి.. ఇవాళ (ఫిబ్రవరి 17) గ్రేటర్ ​వ్యాప్తంగా పనులు బంద్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: చార్మినార్ సర్కిల్ దూద్ బౌలిలోని జమల్ బికా తకియలో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ మహమ్మద్ ఈసాపై శనివారం రాత్రి స్థానికులు దాడి చేశారు. సీసీ రోడ్డు పనులు చేస్తుండగా మరో రోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్ కవర్ తొలగించాలని స్థానికులు కోరారు. 

అక్కడ రోడ్డు వేసే టైంలో తొలగిస్తామని కాంట్రాక్టర్​ జవాబివ్వడంతో, చెప్పిన వెంటనే పని చేయవా అంటూ అతడిపై దాడికి పాల్పడినట్లు తెలిసింది. గాయపడ్డ  ఈసాను  పోలీసులు దవాఖానకు తరలించి కేసు నమోదు చేశారు.  దాడికి నిరసనగా సోమవారం గ్రేటర్​లో పనులు బంద్ చేస్తున్నామని కాంట్రాక్టర్లు ప్రకటించారు.