మే18 నుంచి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల బంద్

మే18 నుంచి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల బంద్
  •     రూ.1,350 కోట్ల పెండింగ్​బిల్లులు ఇవ్వాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు :  జీహెచ్ఎంసీలోని కాంట్రాక్టర్లు శనివారం నుంచి బంద్​కు పిలుపునిచ్చారు. ఇప్పటికే పూర్తిచేసిన పనులకు సంబంధించి రూ.1,350 కోట్ల బిల్లులు పెండింగ్​పెట్టడంతో బంద్ కు దిగారు. పెండింగ్​బిల్లులు రిలీజ్​చేసేవరకు పనులు కొనసాగించబోమని తేల్చిచెప్పారు. ఈ మేరకు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఇప్పటికే జోన్​స్థాయిలో కొందరు కాంట్రాక్టర్లు పనులను బంద్ చేశారు.

శనివారం నుంచి కాంట్రాక్టర్లంతా పనులు బంద్ చేసి నిరసనకు దిగనున్నారు. అయితే వానా కాలానికి ముందు పనులు ఆపడంతో సిటీలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. రోడ్ల రిపేర్లు, నాలాల పనులు ఆగితే భారీ వర్షాల టైంలో సమస్యలు చుట్టుముట్టొచ్చు. గతంలో ఇలాగే పలుమార్లు కాంట్రాక్టర్లు సమ్మెకు దిగారు. ఆ టైంలో ఎంతో కొంత బిల్లులు రిలీజ్​చేసి, బల్దియా సమ్మెను విరమింపజేస్తోంది.