జులై 6న జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: జులై 6న జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కౌన్సిల్ సభ్యుల నుంచి ప్రశ్నలు తీసుకున్నారు. మొత్తం 148 ప్రశ్నలు వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 19న చివరి సమావేశం జరిగింది. అప్పుడు బడ్జెట్ ప్రవేశ పెట్టడం, సమయం సరిపోకపోవడంతో రెండు రోజులపాటు సమావేశాలు జరిగాయి.