జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో ఆందోళన

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో ఆందోళన

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం గందరగోళంగా మారింది. శనివారం ఉదయం కౌన్సిల్ సమావేశానికి ముందే బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. మేయర్ పోడియం ముట్టడించి మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. దీంతో  సమావేశాన్ని 15 నిమిషాల పాటు వాయిదా వేశారు మేయర్. కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే లాస్యా నందితా మృతికి కార్పొరేట్లు సంతాపం తెలిపారు.

ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభంలోనే కౌన్సిల్ 15 నిమిషాల పాటు వాయిదా పడింది. తర్వాత మళ్లీ సమావేశం మొదలైనా కార్పొరేటర్లు ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు గులాబీ కార్పొరేటర్లు. చాలా కీలకమైన బల్దియా సమావేశాల్లో బీఆర్ఎస్ సభ్యులు కావాలనే గొడవ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మీ. సిటీలో పబ్లిక్ సమస్యలు, పరిష్కారాలపై చర్చించకుండా ఇలా రచ్చ చేయడం ఏంటని మండిపడ్డారు మేయర్.