అక్రమ నిర్మాణాల కూల్చివేసిన జీహెచ్ఎంసీ

అక్రమ నిర్మాణాల కూల్చివేసిన జీహెచ్ఎంసీ

హైదరాబాద్: పాతబస్తీలో నాలాలపై ఉన్న కబ్జాలు తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. భారీ బందోబస్తు మధ్య బహదూర్ పురా వద్ద కిషన్ బాగ్ వెళ్లే దారిలో నాలాపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఎమ్మెల్యే మోజంఖాన్ తో పాటు కార్పొరేటర్ హుసేన్ బాష, చార్మినార్ ఏసీపీ తదితరులు కూల్చివేతలను పర్యవేక్షించారు. 
అక్రమ నిర్మానాలు చేపడితే కూల్చేస్తాం 
ప్రభుత్వ స్థలాలు, చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చివేసి చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్‌‌‌‌ తహసీల్దార్‌‌‌‌ చంద్రశేఖర్‌‌‌‌ హెచ్చరించారు. శివరాంపల్లి ఊర చెరువులోని సర్వే నం. 18,64,68లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను రాజేంద్రనగర్‌‌‌‌ రెవెన్యూ సిబ్బంది గురువారం కూల్చివేశారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నా కబ్జాదారులు నిర్మాణాలను ఆపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ ఆస్తులను వదిలేసి ప్రజలపై బల్దియా ప్రతాపం

బర్త్​కు బదులు డెత్​ తప్పులతడకగా సర్టిఫికెట్ల జారీ

అనుమతి లేకుండా స్లాటర్ హౌస్

బండ్లగూడ చెరువుకు గండి