మైలార్​దేవ్​పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

మైలార్​దేవ్​పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

గండిపేట, వెలుగు: మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీలోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఇక్కడి సర్వే నంబర్168 నుంచి178 వరకు ఉన్న స్థలాల్లో ఇండ్లు మాత్రమే నిర్మించుకోవాలి. అయితే ఎలాంటి పర్మిషన్లు లేకుండా కొందరు ఐదు భారీ షెడ్లు నిర్మిస్తున్నారు.

స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో స్పందించిన బల్దియా అధికారులు మంగళవారం ఉదయం మూడు జేసీబీలతో వాటిని కూల్చివేశారు. పోలీసులు బందోబస్త్​ఏర్పాటు చేశారు. పర్మిషన్​లేకుండా నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్‌ హెచ్చరించారు.