నాలాల‌పై అక్ర‌మ క‌ట్ట‌డాలను కూల్చివేస్తున్నGHMC

నాలాల‌పై అక్ర‌మ క‌ట్ట‌డాలను కూల్చివేస్తున్నGHMC

హైదరాబాద్‌లో చెరువులు, నాలాల భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేత ప్రారంభమైంది. GHMC సిబ్బంది మల్కాజ్‌గిరితో పాటు పటేల్‌నగర్‌లో నాలాలపై అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చి వేశారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో అక్రమకట్టాలను GHMC  అధికారులు గుర్తించారు. శుక్రవారం మంత్రి కేటీఆర్‌ మల్కాజ్‌గిరి ప్రాంతంలో పర్యటించి అక్రమ కట్టడాల కూల్చివేతకు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దగ్గరుండి కూల్చివేత పనులను పర్యవేక్షిస్తున్నారు. నాలుగు రోజుల కిందట కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. చెరువు శిఖాలు, నాలాల భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కారణంగా వరద వెల్లేందుకు వీల్లేక ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి  వీలైనంత త్వరగా అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది నాలాలు అక్ర‌మించి క‌ట్టిన క‌ట్ట‌డాల‌ను కూల్చివేస్తున్నారు.