ఫుట్ పాత్పై గుడిసెలు తొలగించిన జీహెచ్ఎంసీ అధికారులు

ఫుట్ పాత్పై గుడిసెలు తొలగించిన జీహెచ్ఎంసీ అధికారులు

హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జీపీఆర్ఏ క్వార్టర్స్‌ వద్ద రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ పై ఉన్న గుడిసెలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. భారీ పోలీసు బలగాల మధ్య గుసెలను తొలగించారు. ఇక్కడ సుమారు యాబై గుడెసెలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. గుడిసెలు కాలీ చేయాలని వారికి గతంలోనే నోటీసులు జారీ చేశామని, కొంతకాలంగా కాలీ చేయాల్సిందిగా సూచించామని తెలిపారు. అయినా గుడిసెలు కాలీ చేయకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు కూల్చివేతలు చేపట్టామని అధికారులు పేర్కొన్నారు. 

అయితే కాలీ చేస్తామని చెప్పినా తమ గుడిసెలు కూల్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు మరో చోటు ఉండటానికి స్థలం చూసించాలని.. లేదా ఎక్కడైనా డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. గుడిసెలు కూల్చేయడంతో వారంతా రోడ్డున పడ్డారు. ఎక్కడికి పోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.