జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు.
నవంబర్ 18 ,19, 20 నుంచి నామినేషన్స్ స్వీకరణ, 21 పరిశీలన, 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్స్ విత్ డ్రాకు అవకాశం. అదే రోజు అభ్యర్థుల ఫైనల్ . డిసెంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. డిసెంబలర్ 4 న ఓట్ల లెక్కింపు, ఫలితాలు. 3న అవసరమైతే రీపోలింగ్ . జీహెచ్ఎంసీ మేయర్ జనరల్ మహిళకు కేటాయింపు. జీహెచ్ఎంసీ జనరల్ అభ్యర్థులకు నామినేషన్ డిపాజిట్ రూ.5 వేలు, ఎస్సీ,ఎస్టీ ,బీసీ మైనార్టీలకు రూ.2500 నామినేషన్ డిపాజిట్ . డివిజన్ అభ్యర్థి ఖర్చు రూ. 5 లక్షలుగా నిర్ణయించారు.
నామినేషన్స్ టర్మ్ పూర్తయ్యే లోపు ఎలక్షన్స్ నిర్వహించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు పార్థసారథి. 2016 రిజర్వేషన్ల ప్రకారమే ఎలక్షన్స్ జరుగుతున్నాయన్నారు. 150 వార్డులకు 150 కౌంటిగ్ సెంటర్లు ఉంటాయన్నారు. బ్యాలెట్ బాక్స్ ద్వారా ఎలక్షన్స్ జరుగుతాయన్నారు.
గ్రేటర్ లో మొత్తం 74 లక్షల 4 వేల 286 ఓటర్లు ఉన్నారన్నారు . అందులో పురుషులు 38 లక్షల 56 వేల 770 , మహిళలలు 35 లక్షల 46 వేల 847, ఇతరులు 669, పోలింగ్ కేంద్రాలు 9248 ,గ్రేటర్ లో 150 వార్డులు , గ్రేటర్ లో అతి పెద్ద డివిజన్ మైలార్ దేవ్ పల్లిలో 79 వేల 290 మంది ఓటర్లు ఉన్నారు. అతి చిన్న డివిజన్ అయిన రామచంద్రాపురంలో 27 వేల 948 మంది ఓటర్లు ఉన్నారు.