ఎల్లుండి 3వ తేదీ సాయంత్రం 6 తర్వాతే ఎగ్జిట్ పోల్స్ కు అవకాశం
హైదరాబాద్: ఓల్డ్ మలక్ పేట్ లో ఎన్నికల పోలింగ్ నిలిచిపోయినందున ఇవాళ పోలింగ్ ముగిసిన వెంటనే ఎలాంటి ఎగ్జిట్ పోల్ అంచనాలు ప్రకటించకూడదని ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు. వాయిదా వేసిన ఓల్డ్ మలక్ పేట లో ఎల్లుండి 3వ తేదీన రీపోలింగ్ జరుగుతుందని.. రీపోలింగ్ ముగిసే వరకు ఎవరూ ఎలాంటి ఎగ్జిస్ట్ పోల్స్ ప్రకటించడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు.