నేరేడ్ మెట్ డీవిజన్ ఫలితం వెల్లడికి తొలగిన అడ్డంకులు

నేరేడ్ మెట్ డీవిజన్ ఫలితం వెల్లడికి తొలగిన అడ్డంకులు

హైదరాబాద్: పెండింగ్ లో ఉండిపోయిన  నేరేడ్ మెట్ డీవిజన్ ఫలితం వెల్లడికి అడ్డంకులు తొలగిపోయాయి. బ్యాలెట్ పేపర్లపై స్వస్తిక్ గుర్తు తోపాటు వేరే గుర్తులున్న ఓట్లు పరిగణలోకి తీసుకునేందుకు హైకోర్టు అనుమతించింది. ఇతర ముద్రతో ఉన్న 544 ఓట్లు లెక్కించాలని హైకోర్టు ఆదేశించింది. బీజేపీ లీగల్ సెల్ ఇంచార్జి ఆంటోనీ రెడ్డి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఎన్నికపై వివాదం ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్ ను ఆశ్రయించ వచ్చుని హైకోర్టు సూచించింది. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్తికి 504 ఓట్ల మెజారిటీ వచ్చింది. లెక్కించాల్సిన ఇతరముద్ర ఓట్లు 544 ఉన్నాయి.