హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి ఒక శాతం ఓటింగ్ పెరుగుదల నమోదైంది. 2016లో జరిగిన ఎన్నికల్లో 45.29 శాతం ఓటింగ్ నమోదు కాగా.. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో 149 డివిజన్లలో 46.6 శాతం పోలింగ్ జరిగింది. అంటే 2016 ఎన్నికలతో పోలిస్తే అధికంగా 1.31 శాతం పోలింగ్ నమోదు అయింది. వాయిదా పడిన ఓల్డ్ మలక్ పేట బూత్ లో రీపోలింగ్ జరిగితే ఓటింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉంది.
గతంలో ఎన్నడూ లేనంత హైటెన్షన్ క్రియేట్ చేసిన ఈ ఎన్నికల్లో ఓటేసిన గ్రేటర్ ప్రజలు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారు. అయితే కరోనా నిబంధనల దృష్ట్యా సోషల్ డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చేయడంతో కొన్ని చోట్ల తప్ప ఎక్కడా బారులు కనిపించలేదు. మొత్తం 150 డివిజన్లకు పోటీ జరగింది. 149 డివిజన్లలో 46.6 శాతం మంది ఓటేశారు. ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో బ్యాలెట్ పేపరుపై సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తును ముద్రించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ డివిజన్ ఎన్నికను రద్దు చేసింది. రేపు అంటే డిసెంబరు 3న రీ పోలింగ్ జరపాలని ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 4న శుక్రవారం 150 డివిజన్ల ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఓటింగ్ పూర్తయిన బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్ర పరిచారు.
జీహెచ్ఎంసీ 2020 ఎన్నికల్లో ఓటింగ్ వివరాలు
పురుషులు 18,57,041
మహిళలు 15,97,438
ఇతరులు 73
మొత్తం 3454552
పోలింగ్ కేంద్రాలు – 9,101పోలింగ్
సిబ్బంది – 36,404
గ్రేటర్‌లోని జోన్లు – 6వాటి పరిధిలోని సర్కిళ్లు – 30
మొత్తం డివిజన్లు – 150
10 నుంచి 40శాతం లోపు పోలింగ్ నమోదైన డివిజన్లు – 17
40 నుంచి 50శాతం లోపు పోలింగ్ నమోదైన డివిజన్లు – 93
50శాతానికి పైగా పోలింగ్ నమోదైన డివిజన్లు – 39
అత్యధిక పోలింగ్ నమోదైనవి
కంచన్‌బాగ్ 70.39%
ఆర్సీపురం 67.71%
పటాన్‌చెరు 65.77%
భారతినగర్ 61.89%
గాజులరామారం 58.61%
నవాబ్ సాహెబ్ కుంట 55.65%
బౌద్ధనగర్ 54.79%
దత్తాత్రేయ నగర్ 54.67%
రంగారెడ్డినగర్ 53.92%
జంగంమెట్ 53.8%
అత్యల్ప పోలింగ్ నమోదైనవి..
యూసుఫ్‌గూడ 32.99%
మెహదీపట్నం 34.41%
సైదాబాద్ 35.77%
సంతోష్ నగర్ 35.94%
మియాపూర్ 36.34%
తక్కువ పోలింగ్ నమోదైన డివిజన్లలో పాతబస్తీవే అధికంగా ఉన్నాయి.
చివరి 20 డివిజన్లలో 9 పాతబస్తీలోనివే
మెహదీపట్నం, సైదాబాద్, సంతోష్‌నగర్, మూసారంబాగ్, విజయనగర్‌కాలనీ, ఆజంపుర, అక్బర్‌బాగ్, డబీర్‌పురా,
ఐఎస్ సదన్.
తర్వాతి స్థానంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని డివిజన్లు
మియాపూర్ హైదర్‌నగర్ మాదాపూర్ చందానగర్ హఫీజ్‌పేట, అల్విన్ కాలనీ
శివారు ప్రాంతాల్లో భారీగా నమోదైన పోలింగ్ సెంటర్లు
పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్సీ పురం, పటాన్‌చెరు, భారతినగర్ డివిజన్లలో చైతన్యం వెల్లవిరిసింది
జీహెచ్ఎంసీ సర్కిళ్ల వారీగా చూస్తే పటాన్‌చెరులో 65.09శాతం,
గోషామహల్ 51.8శాతం,
హయత్‌నగర్‌లో 51.04శాతం,
గాజులరామారంలో 53.65శాతం,
చాంద్రాయణగుట్టలో 53.07శాతం నమోదైంది.
గతంకన్నా పోలింగ్ ఎక్కువగానే నమోదైంది.
కొవిడ్, వరుస సెలవులు లేకుంటే పోలింగ్ మరింత పెరిగేదంటున్నారు ఎన్నికల అధికారులు.