టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్-బీజేపీ పార్టీలు దొంగ నాటకాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జీఎస్టీ, నోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అంశాల్లో సీఎం కేసీఆర్ మద్దతు పలికారా..? లేదా? అని ఆయన నిలదీశారు. గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తొలుత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆకస్మిక మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ.. ఆయన మరణం పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కి మూల స్తంభం లాంటి నాయకులని పేర్కొన్నారు. అహ్మద్ పటేల్ ఆకస్మిక మరణం కాంగ్రెస్పార్టీ కి తీరని లోటన్నారు. ఇప్పటి వరకు చెట్టా పట్టాలు వేసుకున్న టీఆర్ఎస్-బీజేపీలు గ్రేటర్ ఎన్నికల్లో దొంగ నాటకాలు అడుతున్నాయని విమర్శించారు. బండి సంజయ్ కు రాజకీయ అవగాహన లేదని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. కరీంనగర్ లో కార్పొరేటర్ గా గెలిచిన ఆయన ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడని ఆరోపించారు. బండి సంజయ్ కు హైదరాబాద్ ఎక్కడుందో కూడా సరిగా తెలియదు.. అలాంటి వ్యక్తికి ప్రెసిడెంట్ ఇస్తే ఇలాగే ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు.
for more News…
ఆ ఊరిలో అమ్మాయి పుడితే 5వేలు డిపాజిట్.. పెద్దయ్యాక ఊరోళ్లే పెళ్లి కూడా చేేస్తారు