నేరెడ్ మెట్ డివిజన్ ను గెలుచుకున్న టీఆర్ఎస్

నేరెడ్ మెట్ డివిజన్ ను గెలుచుకున్న టీఆర్ఎస్

హైదరాబాద్: నెరేడ్ మెట్ 136 డివిజన్ ను ఊహించినట్లే టీఆర్ ఎస్ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్ధి మీనా ఉపేందర్ రెడ్డి 782 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తన సమీప  బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడి పై మొత్తం 782 ఓట్ల అధిక్యం సాధించారు. ఈనెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగినప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి మీనా 504 ఓట్ల మెజారిటీ తో ఉన్న విషయం తెలిసిందే. అయితే స్వస్తిక్ తోపాటు ఇతర ముద్రలతో ఉన్న ఓట్లు 544 ఉండడంతో వాటిని పక్కన పెట్టారు. అయితే ఫలితం ప్రకటించేందుకు వీటిని పరిగణలోకి తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులతో ఇవాళ సైనిక్ పురిలోని వివేకానంద కాలేజీలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. టీఆర్ఎస్ కు మొత్తం ఓట్లు 10 వేల 330 ఓట్లు రాగా.. బీజేపీకి 9 వేల 662 ఓట్లు వచ్చాయి. టి.ఆర్.ఎస్ అభ్యర్థి మినా 782 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.