అంతయ్య డెడ్‌బాడీ దొరికింది

అంతయ్య డెడ్‌బాడీ దొరికింది

సాహెబ్ నగర్‌ నాలాలో ఏడు రోజుల క్రితం తప్పిపోయిన కాంట్రాక్ట్ కార్మికుడు అంతయ్య డెడ్ బాడీని కోయంబత్తూర్ టీమ్ గుర్తించింది. ఘటన జరిగిన దగ్గర నుంచి 12వ మ్యాన్ హోల్ దగ్గర అంతయ్య డెడ్ బాడీ దొరికింది. డెడ్ ‌బాడీని ఏడు రోజుల తర్వాత అధికారులు గుర్తించారు. అంతయ్య డెడ్ బాడీ కోసం జీహెచ్ఎంసీ రెస్క్యూ సిబ్బంది దాదాపు ఐదు రోజులుగా ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దాంతో అంతయ్య కుటుంబ సభ్యులతో పాటు... ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరగటంతో... జీహెచ్ఎంసీ అధికారులు కోయంబత్తూర్ నుంచి స్పెషల్ టీమ్‌ను పిలిపించారు. సోమవారం ఉదయం రెస్స్యూ ప్రారంభించిన కోయంబత్తూర్ స్పెషల్ టీమ్... ఘటన జరిగిన దగ్గర నుంచి 12వ మ్యాన్ హోల్ దగ్గర అంతయ్య డెడ్ బాడీని గుర్తించింది. 

ఏడు రోజుల క్రితం వరద నీటి కాలువలో సిల్ట్ తీసేందుకు దిగిన కార్మికులు శివ, అంతయ్య చనిపోయారు. చనిపోయిన కొద్దిగంటల్లోనే శివ మృతదేహాన్ని బయటకుతీయగా.. అంతయ్య డెడ్ బాడీ కోసం 7 రోజులుగా వెతికారు.