మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీహెచ్ఎంసీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న సౌందర్య.. అదే జీహెచ్ఎంసీకి చెందిన చెత్త లారీ కింద పడి మృతిచెందింది. సౌందర్య జీహెచ్ఎంసీలో ఏరియా సూపర్ వైజర్‌గా పనిచేస్తుంది. ఆమె మంగళవారం ఉదయం విధులలో భాగంగా ఆఫీసుకు వెళ్తుంది. రాధిక సర్కిల్ వద్దకు రాగానే.. జీహెచ్ఎంసీకి చెందిన చెత్త లారీ ఆమెను బలంగా ఢీకొట్టి, ఆమె పైనుంచి దూసుకెళ్లింది. దాంతో సౌందర్య అక్కడికక్కడే మృతిచెందింది. తలకు హెల్మెట్ ఉన్నా సరే.. ముఖం గుర్తుపట్టని విధంగా చిద్రం అయింది. ప్రమాద సమయంలో అక్కడున్న స్థానికులు లారీ డ్రైవర్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
కుషాయిగూడలో జరిగిన మరో ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. సోమవారం రాత్రి రెండు గంటల సమయంలో ఒక వ్యక్తి రాధిక చౌరస్తా నుంచి ఈసీఐఎల్ వైపు వెళ్తున్నాడు. సదరు వ్యక్తి మితిమీరిన వేగంతో బండి నడపడం వల్ల.. బండి అదుపుతప్పి స్కిడ్ అయి కిందపడినట్లు సమాచారం. కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయలవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
For More News..