ఎల్బీ నగర్ లో జీహెచ్ఎంసీ ఉద్యోగుల ఆందోళన

ఎల్బీ నగర్ లో  జీహెచ్ఎంసీ ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్ లోని  ఎల్బీనగర్ లో   జీహెచ్ఎంసీ  ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్న  ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ  సర్కిల్ 4  డిప్యూటీ కమిషనర్  ఇస్లావత్ సేవా నాయక్ ను  సస్పెండ్ చేయాలంటూ  ఎల్బీనగర్ కార్యాలయం  ముందు ఆందోళనకు దిగారు. 

ఎల్బీనగర్ జీహెచ్ఎంసి సర్కిల్ 4 డిప్యూటీ కమిషనర్  ఇస్లావత్ సేవ నాయక్  ట్యాక్స్ ఇన్స్పెక్టర్లను, ఉద్యోగులను వేధిస్తున్నారని ఆరోపించారు.  ఉదయం ఆరు గంటలకే విధుల్లో ఉండాలని  ఒత్తిడి చేయడం వల్ల ఉద్యోగులు   ప్రమాదాలకు గురవుతున్నారని  బీఎంఈ యూ  ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.

Also Read :- హైదరాబాద్ లో ఆయన విగ్రహం పెడతాం 

పని ఒత్తిడి వల్లే  ట్యాక్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రాజు డిసెంబర్ 2న ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ పై నుంచి  కింద పడి  తలకు తీవ్ర గాయాకావడంతో  బ్రెయిన్ సర్జరీ జరిగిందన్నారు ఉద్యోగులు. అతడి పరిస్థితికి డిప్యూటీ కమిషనర్ వేధింపులేనని కారణమని ఆరోపించారు.

 ఆఫీసుకు ఉదయం10 గంటలకు ఆఫీసు అయితే ముందుగా  6,7 గంటలకు రావాలని మెసేజ్ లు పెట్టడం..   మహిళా ఉద్యోగులను రాత్రి 8 గంటల వరకు విధుల్లో ఉంచుతున్నారని చెప్పారు. ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నా సర్కిల్ 4 డిప్యూటీ కమిషనర్ ఇస్లావత్ సేవా నాయక్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.