పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా సిటీలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సిలపై GHMC ఫైన్ విధించింది. రెండు జరిమానాలకు సంబంధించి ఆయన పేరుపై లక్షా పదివేలు ఫైన్ వేసింది. అయితే రెండ్రోజులుగా సిటీలో సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ కౌశిక్ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి నుంచి టీఆర్ఎస్ భవన్ వరకు పూర్తిగా జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సిలు, కటౌట్లతో నింపేశారు. రెండ్రోజుల నుంచి ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. కళ్లముందే కనిపిస్తున్నా ఏ ఒక్క ప్లెక్సిని కూడా తీసేయలేదు. ప్రతిపక్ష పార్టీలు పెట్టిన ప్లెక్సిలను మాత్రం క్షణాల్లో తొలగించే అధికారులు..అధికార పార్టీ ప్లెక్సిల విషయంలో కళ్లు మూసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇవాళ కౌశిక్ రెడ్డి జాయినింగ్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత..తీరిగ్గా ప్లెక్సీలను తొలగిస్తున్నారు GHMC సిబ్బంది.