చెట్టు నరికేసిన వ్యక్తికి రూ. 25 వేల జరిమానా విధించిన GHMC

చెట్టు నరికేసిన వ్యక్తికి రూ. 25 వేల జరిమానా విధించిన GHMC

హరితహారం పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏడాది భారీ సంఖ్యలో మొక్కలు నాటుతోంది. అంతేకాదు గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు చెట్లను నరికివేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎవరికైనా తప్పనిసరిగా చెట్లు కొట్టేయాల్సిన అవసరం వస్తే స్థానిక అధికారుల దగ్గర అనుమతి తీసుకోవాలని సూచించింది.  అయితే కొందరు రూల్స్ ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసాసరంగా చెట్లను కొట్టేస్తున్నారు.

అధికారుల నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా హైదరాబాద్‌ ఎల్బీ నగర్ ఎఫ్‌సీఐ కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి ముందున్న చెట్టుని నరికించేశాడు. దీన్ని సురభి మెట్‌పల్లి అనే యువతి వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌ను ట్యాగ్ చేసింది. దీనిపై స్పందించిన ఎంపీ సంతోష్ GHMC మేయర్ బొంతు రామ్మోహన్‌ను అలర్ట్ చేశారు. మేయర్ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌ను ఎఫ్‌సీఐ కాలనీకి పంపి.. చెట్టు నరికించిన వ్యక్తికి రూ. 25 వేలు జరిమానా విధించారు.