- ఆమె అనుచరుడికి జీహెచ్ఎంసీ జరిమానా
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ విజయలక్ష్మికి విషెస్ చెబుతూ ఆమె అనుచరులు, అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. జీహెచ్ఎంసీ వాటిని తొలగించడంతో పాటు ఫైన్లు విధించింది. రూల్స్ బ్రేక్ చేసి ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారంటూ నెటిజన్స్ కంప్లయింట్ చేయడంతో బల్దియా ఈ మేరకు చర్యలు తీసుకుంది. మేయర్ అనుచరుడు అతీశ్ అగర్వాల్ కు ఏకంగా రూ.3.15 లక్షల ఫైన్ వేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, 12, టీఆర్‌ఎస్ భవన్, ఈఎస్‌ఐ హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో మేయర్ కు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు తార్నాక పరిసరాల్లో డిప్యూటీ మేయర్ కు సంబంధించిన పోస్టర్లు కనిపించాయి. వీటిపై నెటిజన్లు ట్విట్టర్ లో జీహెచ్ఎంసీకి కంప్లయింట్ చేశారు. దీనిపై మేయర్ స్పందిస్తూ.. ‘చట్టం ముందు అందరూ సమానమే. నాపై అభిమానంతో రూల్స్ బ్రేక్ చేసిన వారికి ఫైన్లు వేయడాన్ని స్వాగతిస్తున్నా. మళ్లీ ఎవరైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే, ఇలాంటి ఫైన్లు తప్పవు. రూల్స్ ముందుగా రాజకీయ నేతలు పాటిస్తే, జనం కూడా పాటిస్తారు’ అని అన్నారు.
For More News..