హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో దోమలు, సీజనల్వ్యాధుల నియంత్రణకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. 4,846 డెంగ్యూ ప్రభావిత కాలనీల్లో ఇంటింటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శుక్రవారం డ్రై డే నిర్వహిస్తోంది.
ఇప్పటి వరకు 3,254 స్కూళ్లు, 354 కాలేజీల్లో అవగాహన కల్పించినట్లు అధికారులు తెలిపారు. 2,751 మంది స్టూడెంట్లను వలంటీర్లుగా నియమించి శిక్షణ ఇచ్చామన్నారు. పైరెత్రమ్ అండ్ ఇండోర్ రెసిడ్యూవల్ స్ప్రే చేయడం, అన్ని హాట్ స్పాట్ లు, డెంగ్యూ వ్యాధి ప్రబలినప్రాంతాలను గుర్తించి ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు.