హుస్సేన్ సాగర్ క్లీనింగ్ పై దృష్టి పెట్టిన జీహెచ్ఎంసీ

హుస్సేన్ సాగర్ క్లీనింగ్ పై దృష్టి పెట్టిన జీహెచ్ఎంసీ

నిమజ్జనాలు పూర్తి కావస్తుండటంతో హుస్సేన్ సాగర్ క్లీనింగ్ పై దృష్టి పెట్టారు అధికారులు. ఇప్పటికే ట్యాంక్ పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగిస్తున్నారు. విగ్రహాల నిమజ్జనంతో సాగర్ లో పేరుకుపోయిన స్క్రాప్ ను తొలగింపు పనులు మొదలుపెట్టారు. మధ్యాహ్నం తర్వాత ట్యాంక్ బండ్ లో పూర్తిస్థాయి క్లీనింగ్ పనులు చేపడ్తామన్నారు. రెండు రోజుల్లో క్రేన్లను తొలగిస్తామని తెలిపారు. ఇప్పటివరకు పది అడుగులకు పైనున్న 5వేల 5వందల విగ్రహాలు ట్యాంక్ బండ్ నిమజ్జనం అయ్యాయని చెప్పారు అధికారులు.