
హైదరాబాద్సిటీ, వెలుగు: అప్పుల భారంతో సతమతమవుతున్న జీహెచ్ఎంసీకి కొత్త ఆర్థిక సంవత్సరం కలిసొచ్చేలా ఉంది. 2024–25లో ప్రాపర్టీ ట్యాక్స్ కింద రూ.2,038కోట్లు రాగా, భవన నిర్మాణ అనుమతులతో రూ.1,138.44 కోట్లు వచ్చినట్లు బుధవారం అధికారులు వెల్లడించారు. ప్రాపర్టీ ట్యాక్స్తర్వాత భవన నిర్మాణ అనుమతులు బల్దియాకు రెండో ప్రధాన ఆదాయ వనరుగా నిలిచినట్లు తెలిపారు.
మొత్తం 13,421 రకాల నిర్మాణ అనుమతులను జారీ చేసి, రూ.1138.44 కోట్ల ఆదాయం సాధించినట్లు చెప్పారు. ఇందులో 523 ఇన్‌స్టంట్ రిజిస్ట్రేషన్లు, 8,377 ఇన్‌స్టంట్ అప్రూవల్స్, సింగిల్ విండో ద్వారా 2,422, గేటెడ్ కమ్యూనిటీలతో కూడిన లేఅవుట్‌లు 6, ఓపెన్ ప్లాట్‌లతో లేఅవుట్‌లు 5, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు 2,088 ఉన్నాయని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు వెల్లడించారు.