- ఇయ్యాల్టితో ముగియనున్న స్కీమ్
- చివరి రోజు రూ.80 నుంచి 90 కోట్లు వస్తుందని అంచనా
- ఇప్పటివరకు రూ.710 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు
హైదరాబాద్, వెలుగు: ‘ఎర్లీబర్డ్’ స్కీమ్ అమలుతో జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయం వచ్చింది. ఎన్నికల సమయంలోనూ ప్రాపర్టీదారుల నుంచి గతంలో ఎన్నడూ లేనంత రెస్పాన్స్వచ్చింది. ఈ నెల 1 నుంచి సోమవారం రాత్రి వరకు ఎర్లీబర్డ్స్కీమ్కింద రూ.710 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్కలెక్ట్అయినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. గతేడాది ఏప్రిల్లో రూ.766 కోట్లు రాగా, ఈసారి రూ.800 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చివరి రోజైన మంగళవారం రూ.80 నుంచి 90 కోట్లు రావచ్చని చెబుతున్నారు. గతేడాది ఏప్రిల్ లో ఎర్లీబర్డ్కింద రూ.750 కోట్లు టార్గెట్పెట్టుకోగా, అంతకు మించి వచ్చింది.
ప్రస్తుతం సిబ్బంది అంతా ఎన్నికల హడావిడిలో ఉండడంతో ఈసారి ఎలాంటి టార్గెట్పెట్టుకోలేదు. అయినప్పటికీ గతేడాదికి మించి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్లో జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్ స్కీమ్ ని అమలు చేస్తోంది. దీని కింద ప్రాపర్టీ ట్యాక్స్చెల్లిస్తే 5 శాతం రిబిట్వస్తుంది.
ఈసారి 6.58 లక్షల మంది
ఎర్లీబర్డ్ కింద ప్రాపర్టీ ట్యాక్స్చెల్లించేవారి సంఖ్య ఏటా పెరుగుతోంది. గతేడాది 6లక్షల10వేల మంది సద్వినియోగం చేసుకోగా, ఈసారి ఆ సంఖ్య 6లక్షల58వేలకు చేరింది. రిబిట్ వస్తుండడంతో ప్రాపర్టీదారులు ట్యాక్స్చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఎర్లీబర్డ్ స్కీమ్ జీహెచ్ఎంసీలో ఎనిమిదేండ్లుగా అమలవుతోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.362 కోట్ల ఆదాయం రాగా, 2018-19లో రూ.432కోట్లు, 2019–20లో రూ.535 కోట్లు, 2020-21లో రూ.572 కోట్లు, 2021-22లో రూ.541 కోట్లు, 2022-23లో రూ.743 కోట్లు, 2023–24లో రూ.766 కోట్లు వసూలయ్యాయి. ఈసారి ఒకరోజు మిగిలి ఉండగానే రూ.710 కోట్ల ఆదాయం వచ్చింది.