
- 11 నెలలు పని చేసిన రొనాల్డ్‌రోస్
- కేంద్రం ఆదేశాలతో ఆమ్రపాలి ఏపీకి
- 6 నెలల కమిషనర్‌గా ఇలంబరితి
- కొత్త కమిషనర్ కర్ణన్ముందు అనేకA సవాళ్లు
- నేడు బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఒక్క ఏడాదిలో జీహెచ్ఎంసీకి ముగ్గురు కమిషనర్లు మారారు. నెలల వ్యవధిలోనే బదిలీలు చేస్తుండడంతో కమిషనర్లకు.. అభివృద్ధి, ఇతర పనులపై ఫోకస్చేయడానికి కూడా సమయం సరిపోవడం లేదు. బల్దియాలోని విభాగాలు, ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి పనులు, అధికారుల వివరాలు తెలుసుకునేందుకు రెండు, మూడు నెలలు పడుతోంది. ఏదైనా ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చేసరికి బదిలీ అయిపోతున్నారు. 2023 జులైలో కమిషనర్ గా వచ్చిన రొనాల్డ్ రోస్ జూన్15, 2024లో సెలవుపై వెళ్లారు.
ఆ టైంలో హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా ఉన్న ఆమ్రపాలికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. జూన్24న రొనాల్డ్రోస్తిరిగి జాయిన్ అయినప్పటికీ.. అదే రోజు ఆయనను ఇంధనశాఖ సెక్రటరీ, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా బదిలీ చేశారు. దాంతో ఆమ్రపాలికే పూర్థిస్థాయి బాధ్యతలు అప్పగించారు. జూన్ 26న ఆమె బాధ్యతలు స్వీకరించింది. ఐదు నెలల పాటు పనిచేయగానే ఆమ్రపాలి ఏపీకి వెళ్లాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ ఫుల్ అడిషనల్ కమిషనర్ గా అక్టోబర్ లో ఇలంబరితి బాధ్యతలు చేపట్టారు.
నవంబర్ 11న ఆయనకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. ఆయన ఆరు నెలలు కూడా పని చేయకముందే తాజాగా ఎంఏయూడీ సెక్రటరీగా సర్కారు బదిలీ చేసింది. ఇలంబరితి స్థానంలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గా ఉన్న ఆర్వీ కర్ణన్ ను సర్కారు నియమించింది. మొత్తానికి రొనాల్డ్‌రోస్11 నెలలు, ఆమ్రపాలి 4 నెలలు, ఇలంబరితి 6 నెలలు జీహెచ్ఎంసీ కమిషనర్లుగా పనిచేశారు. వీరిలో రొనాల్డ్ రోస్ మాత్రమే కాస్త ఎక్కువ రోజులు పని చేశారు. నిర్ణయాలు తీసుకునేలోపే ట్రాన్స్ఫర్అయిపోయారు. ఆమ్రపాలి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకపోయినా, ఇలంబరితిని మాత్రం తక్కువ కాలమే కొనసాగించింది.
కర్ణన్ముందు ఎన్నో సవాళ్లు
ఆర్వీ కర్ణన్ మంగళవారం బల్దియా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనుండగా, ఆయనకు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ ఫార్మేటివ్ ఇన్‌ఫ్రస్ట్రక్చర్(హెచ్ సిటీ) ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్లు దాఖలయ్యాయి. ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాల్సిన బాధ్యత కర్ణన్‌పై ఉంది. బల్దియా అప్పులు తీర్చడం కూడా ఆయనకు పెద్ద టాస్కే అని చెప్పాలి.
ఆమ్రపాలి, ఇలంబరితి టైంలో కొత్తగా అప్పులు తేలేదు. మరో పక్కన రికార్డు స్థాయిలో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ రాబట్టారు. ఎన్నడూ లేని విధంగా ఇలంబరితి బల్దియాకు రూ.2వేల కోట్ల ఆదాయాన్ని సంపాదించి పెట్టారు. ఈ రికార్డును కొనసాగించాలన్నా, బీట్చేయాలన్నా కర్ణన్కష్టపడాల్సిందే.. వీటితో పాటు కంటోన్మెంట్ విలీనం, ఏఓసీ సెంటర్ ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణం, శానిటేషన్, స్ట్రీట్ లైట్లు, కొత్త డంపింగ్ యార్డులతో పాటు ముఖ్యమైన ప్రాజెక్టులకు భూ సేకరణ కర్ణన్‌కు పెద్ద సవాల్ గా చెప్పవచ్చు. ఈ పనులపై ఇలంబరితి ఇప్పటికే పూర్తి స్టడీ చేశారు. ఈ టైంలో ఆయనను బదిలీ చేయడంతో కొత్తగా వచ్చిన కమిషనర్కర్ణన్వీటన్నింటిపై అవగాహన పెంచుకోవడానికి టైం పట్టే అవకాశం ఉంది.
ఫుడ్ సేఫ్టీ విషయంలో కర్ణన్ ది గ్రేట్
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గా ఆర్వీ కర్ణన్ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి యాక్షన్తీసుకున్నారనే పేరొచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టల్స్‌పై ఫోకస్‌పెట్టి వరుసగా తనిఖీలు చేయించారు. ప్రమాణాలు పాటించని, రూల్స్ఫాలో కాని వారికి నోటీసులు ఇచ్చి కొన్నింటిని సీజ్కూడా చేయించారు. ఇప్పుడు ఆయనే బల్దియా కమిషనర్‌గా రావడంతో ఫుడ్ సేఫ్టీకి మరింత ప్రాధాన్యం ఇస్తారని అంతా భావిస్తున్నారు.